శ్రీశైల దేవస్థానం:శ్రీమతి పి. రాజేశ్వరి, గుంటూరు మంగళవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా మొత్తం రూ. 5,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందించారు. ఇందులో కీ.శే. వెంకటరత్నం పేరు మీద 2,50,000/-లు , శ్రీమతి పి. రాజేశ్వరి పేరు మీదు రూ. 2,50,000/-లు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. ఈ కార్యక్రమములో పర్యవేక్షకులు కె. శివప్రసాద్ ఉన్నారు.
