శ్రీశైలదేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం కార్తీకమాసమoతా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు మార్గశిర శుద్ధ పాడ్యమి అయిన శుక్రవారం తో ముగిసాయి.
కార్తీక శుద్దపాడ్యమి (22.10.2025) రోజున ప్రారంభించిన ఈ భజన కార్యక్రమంలో కార్తీకమాసమoత కూడా నిరంతరంగా రేయిoబవళ్ళు అఖండ శివపంచాక్షరి నామభజనను చేసారు.
భజనలలో కర్నూలు జిల్లాకు చెందిన మూడు భజన బృందాలకు , కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాలకు అవకాశం కల్పించారు. శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి, కర్నూలు ( 22.10.2025 నుండి 27.10.2025 వరకు ), శ్రీ లక్ష్మీచెన్నకేశవ నాటక కళాభజన మండలి, కర్నూలు (27.10.2025 నుండి 01.11.2025 వరకు),శ్రీ గంగాభవాని సమేత కేదారేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, కర్నూలు ( 01.11.2025 నుండి 06.11.2025 వరకు శ్రీ మౌళీ బసవేశ్వర భజన సంఘ్, గోపనదేవరహళ్ళి, రాయచూర్ జిల్లా (06.11.2025 నుండి 11.11.2025 వరకు), శ్రీ మల్లికార్జున భజన మండలి, సుంకేశ్వరహాల్, రాయచూర్ జిల్లా, కర్ణాటక ( 11.11.2025 నుండి 16.11.2025 వరకు ) శ్రీ ప్రభులింగ సేవా సంఘ్, గోపనదేవరహళ్ళి, రాయచూర్ (16.11.2025 నుండి 21.11.2025 వరకు), వారు భజనలను చేసారు। కాగా ఈ నాటి ముగింపు కార్యక్రమoలో అర్చకస్వాములు తదితరులు పాల్గొన్నారు.
