శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శుక్రవారం వై.వి. నరసింహారావు, పోరుమామిళ్ళ, కడప జిల్లా వారు రామాయణం – సుందరకాండ పై తోలు బొమ్మలాట కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం నుండి తోలుబొమ్మలాట కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో కథకులుగా వి. నరసింహారావు వ్యవహరించగా, గాత్ర సహకారాన్ని రమణారావు, కొండమ్మ, రమణమ్మ, నాగేశ్వరరావు తదితరులు అందించారు.
నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి .
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి
