ఈ నెల 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ముఖ్యఅతిధిగా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ పాల్గొంటున్నారు. ప్రముఖ సంపాదకులు దేవులపల్లి అమర్, అదే విధంగా పుర ప్రముఖులు, వర్కింగ్ జర్నలిస్టులు హాజరు అవుతారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేయడం ప్రారంభించిన రోజునే నేషనల్ ప్రెస్ డేగా జరుపుకుంటాము. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన సంస్థ, . 1956లో ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటును చేస్తూ, జర్నలిజంలో వృత్తిపరమైన నీతిని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడింది. దీని ద్వారా చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థను ఉనికిలోకి తీసుకువచ్చారు.
వర్కింగ్ జర్నలిస్టులు నవంబర్ 16వ తేదీన ఉదయం 10-30 గంటలకు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.
