శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఆహ్వాన పత్రికను అందజేసి దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు శ్రీశైల దేవస్థానం వారు .రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్, శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు ముఖ్యమంత్రి నికలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపికను ( చిత్రపటాన్ని) అందించారు.
దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ఆహ్వానపత్రికను అందజేసి దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమములో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి,దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.
