శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి భజన మండలి, రేగడగూడురు, నంద్యాల జిల్లా వారు భజన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, లింగాష్టకం, శ్రీశైల శివమయం, శివశివ శంకరా, అమ్మా భ్రమరాంబాదేవి, కనరండి కనరండి శ్రీశైలం, పాతాళగంగమ్మ పాదాలు కడుగగా మొదలైన పలు భక్తిగీతాలను, భజనకీర్తనలను నారాయణ, వెంకటమున్నయ్య, బాలరాజు, ఆంజనేయులు, సుబ్బమ్మ, రాములమ్మ, లక్ష్మీదేవి, వెంకటసుబ్బమ్మ తదితరులు ఆలపించారు.
