శ్రీశైల దేవస్థానం:చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీన మధ్యాహ్నం గం.1.00 నుండి 8వ తేదీ ఉదయం గం.5.00 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు.
చంద్ర గ్రహణం 7వ తేదీ రాత్రి గం.9.56 ని.లకు ప్రారంభమై రాత్రి గం.1.26 కు ముగుస్తుంది.
చంద్రగ్రహణం కారణంగా 7వ తేదీన శ్రీ స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తారు. అదేవిధంగా ఆలయములోని అన్ని ఆర్జితసేవలు, పరోక్షసేవలు, శ్రీస్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేస్తారు. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే వుంటుంది.
ఇదే విధాన సాక్షిగణపతి, హాఠకేశ్వరం ఫాలధార పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసి వేస్తారు.
సెప్టెంబరు 8 వ తేదీన ఉదయం గం.5.00 లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజలు వుంటాయి. అనంతరం గం.7.30 నుండి శ్రీ స్వామిఅమ్మవార్లకు మహామంగళహారతులను జరిపిస్తారు. మహామంగళహారతుల సమయం నుండే అనగా ఉదయం గం.7.30ల నుండి మధ్యాహ్నం గం.2.15 వరకు భక్తులందరికీ శ్రీ స్వామి వారి అలంకార దర్శనం కల్పిస్తారు.
సెప్టెంబరు 8 వ తేదీ నాటికి ఆన్లైన్ లో శ్రీ స్వామి వారి స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు , విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం గం.2.15 నుండి సాయంకాలం గం.4.00 వరకు శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తారు.
తిరిగి సాయంకాలం గం. 5.30 నుండి గం.9.00 వరకు అలంకార దర్శనాలు కొనసాగిస్తారు. ఆన్లైన్ ద్వారా శ్రీ స్వామి వారి స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు , విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు రాత్రి గం.9.00 నుంచి స్పర్శదర్శనాలు వుంటాయి.
చంద్రగ్రహణం సందర్భంగా సెప్టెంబరు 7వ తేదీన అన్నపూర్ణా భవనములో ఉదయం గం. 10.30 నుంచి మధ్యాహ్నం గం. 12.00ల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ వుంటుంది. భక్తులు గ్రహణ సందర్భంగా మార్పు చేయబడిన ఆలయ వేళలు , అన్నప్రసాద వితరణ సమయాన్ని గమనించి సహకరించాలని దేవస్థానం కోరింది.
