
*శ్రీశైల దేవస్థానం: పి. చిన్న శంకరప్ప, కర్నూలు సోమవారం దేవస్థాన శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 5,00,116 /-లు , గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ. 5,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన బ్యాంకు చెక్కులను కార్యనిర్వహణాధికారి కార్యాలయములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.