
శ్రీశైల దేవస్థానం: పరస్పర సమన్వయంతో శ్రావణ మాసోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఈ ఓ ఆదేశించారు శ్రావణశుద్ధ పాడ్యమి, జూలై 25 నుంచి శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు
24తో ఈ మాసోత్సవాలు ముగుస్తాయి.
ఈ మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సోమవారం కార్యనిర్వహణాధికారి
యం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పరిపాలనా కార్యాలయములోని సమావేశ మందిరములో నిర్వహించిన ఈ సమీక్షలో
అర్చక స్వాములు, వేద పండితులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, అన్ని విభాగాల యూనిట్ అధికారులు,
పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశములో ఆయా విభాగాల వారిగా చేపట్టవలసిన చర్యల గురించి కార్యనిర్వహణాధికారి
దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రావణ మాసములో ముఖ్యంగా శ్రావణ
సోమవారాలు, శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ, బహుళ ఏకాదశి రోజులు, శ్రావణమాసశివరాత్రి
ప్రభుత్వ సెలవు రోజులలో అధికసంఖ్యలో భక్తులు ఆలయానికి సందర్శించే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల
నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు కూడా ముందస్తుగా ఆయా ఏర్పాట్లను
చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా
చేయాలన్నారు.
ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని
చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.
రద్దీరోజులలో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల :
•
భక్తుల రద్దీ కారణంగా శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ సోమవారాలు, వరలక్ష్మీవ్రతం,
శ్రావణపౌర్ణమి మొదలైన రోజులలో ( మొత్తం 16 రోజులపాటు) గర్భాలయ అభిషేకాలు .
సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలుపుదల.
నిర్ధిష్టవేళలో స్పర్శదర్శనాలు
•
శ్రావణమాసం రద్దీ రోజులలో రోజుకు మూడు పర్యాయాలు స్పర్శదర్శనం,
ఈ స్పర్శదర్శన టికెట్లను ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే దేవస్థానం వెబ్సైట్
‘www.srisailadevasthanam.org’ నుంచి,,
.
అదేవిధంగా ఆగస్టు 15 నుంచి 18 వరకకు స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల,
ఈ రోజులలో పూర్తిగా అలంకార దర్శనం మాత్రమే.
• సర్వదర్శనం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నిర్ధిష్టవేళలో మాత్రమే ఈ స్పర్శదర్శనం వుంటుంది,
• మిగతా సాధారణ రోజులలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా కొనసాగుతాయి.
• భక్తులు వివిధ ఆర్జితసేవాటికెట్లను ఆన్లైన్ ద్వారానే పొందవలసివుంటుంది. ఈటికెట్లను కూడా లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు పొందవచ్చు.
ఆలయ వేళలు
• ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువజామున గం.3.00లకే ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత:కాలపూజలు,
• ఉభయ దేవాలయాలలో గం.4.30 నుంచి మహామంగళ హారతులు,
• మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా గం.4.30లకే భక్తులను దర్శనాలకు అనుమతి,
• సాయంత్రం గం. 4.00ల వరకు సర్వదర్శనం.
• తిరిగి సాయంకాలం గం.4.00 నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళ వాయిద్యాలు, ప్రదోషకాలపూజలు, సుసాంధ్యం తరువాత గం.5.30ల నుంచి మహామంగళహారతులు,
• మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా సాయంకాలం గం. 5.30ల నుంచే రాత్రి గం. 11.00ల వరకు దర్శనాలు కొనసాగుతాయి.
ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతములు
• శ్రావణమాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండు పర్యాయములు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతములు వుంటాయి.
• ఈ ఉచిత వరలక్ష్మీ వ్రతంలో ఒక్కొక్క పర్యాయంలో 1600 మందికి అవకాశం.
• రెండవ పర్యాయం జరిగే ఉచిత వరలక్ష్మీవ్రతంలో ప్రత్యేకంగా 750 మంది చెంచు ముత్తైదవులకు అవకాశం .
• సామూహిక వరలక్ష్మీ వ్రతం జరిపించుకునే భక్తులందరికీ ప్రసాదాలతో పాటు చీర మరియు రవిక వస్త్రం, గాజులు, పసుపుకుంకుమలు, కైలాస కంకణాలు, శ్రీశైలప్రభ మాసపత్రిక, వృక్షప్రసాదంగా దేవతా వృక్షం కూడా అందిస్తారు.
• వ్రతకర్తలకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించడంతో అన్నప్రసాద వితరణ భవనములో భోజన ప్రసాదం వుంటుంది .
• వ్రతకర్తలకు అలంకార దర్శనమునకు మాత్రమే అనుమతి,
పరోక్షసేవగా వరలక్ష్మీ వ్రతము :
• భక్తుల సౌకర్యార్ధమై పరోక్ష ఆర్జితసేవగా వరలక్ష్మీవ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది.
• ఈ పరోక్షసేవకు రూ.1,116-00లను రుసుముగా నిర్ణయించారు.
• పరోక్షసేవగా జరిపించుకున్న భక్తులకు కుంకుమ, విభూతి, కలకండ ప్రసాదం, అక్షితలతో పాటు అమ్మవారి ప్రసాదంగా చీర, రవిక వస్త్రమును పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది.
• దేవస్థానం వెబ్ సైట్ ద్వారా భక్తులు పరోక్షసేవలను నమోదు చేసుకోవలసివుంటుంది.
• కాగా సమావేశంలో కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లకు సంబంధించి ఆయా విభాగాల వారిగా పలు ఆదేశాలు జారీ చేశారు.
• క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారం మరియు బిస్కెట్లను అందజేయాలని అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు.
• అదేవిధంగా భక్తులరద్దీకనుగుణంగా అన్నదానమందిరంలో అన్నప్రసాదవితరణను, సాయంకాలం అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో వండిన వంటకాలన్నీ ప్రతీ భక్తుడికి అందాలన్నారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తుడికి కూడా ప్రతీ వంటకం అందాలన్నారు.
• భక్తుల రద్దీకనుగుణంగా అవసరమైన మేరకు లడ్డుప్రసాదాలను తయారు చేసి అందుబాటులో ఉంచాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు.
• భక్తులు లడ్డూ ప్రసాదాల కోసం అధిక సమయం వేచివుండకుండా త్వరితంగా లడ్డూప్రసాదాలను అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
• రద్దీరోజులలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై స్థానిక పోలీస్ శాఖ వారి సహకారాన్ని పొందాలని సూచించారు.
• భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
అఖండ శివనామ భజనలు :
• లోక కల్యాణం కోసం శ్రావణమాసమంతా శ్రావణశుద్ధ పాడ్యమి (25.07.2025) నుండి బాధ్రపదశుద్ధ పాడ్యమి వరకు అఖండ చతుస్సప్తహా శివభజనలు జరిపించబడుతాయి.
• ఈ అఖండ భజనలలో మొత్తం 7 భజన బృందాలకు అవకాశం,
• ఒక్కొక్క భజన బృందంలో 45 మంది పాల్గొనే అవకాశం.