
శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శనివారం రాత్రి అన్నప్రసాద వితరణను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో ఆయా వంటకాలన్నీ రుచికరంగా ఉండేటట్లుగా తగు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
అన్నప్రసాద వితరణ సమయములో ప్రతీ హాలులో కూడా అన్నప్రసాదాల వడ్డన సజావుగా జరిగేటట్లుగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతీ హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.అదేవిధంగా అన్నప్రసాద సంబంధించి సమయపాలనను ఖచ్చితంగా
పాటించాలన్నారు. ఉదయం వేళలో అన్నప్రసాదాలను, సాయంకాలం అల్పాహారాన్ని ఎటువంటి కాలాతీతం కాకుండా భక్తులకు అందజేస్తుండాలన్నారు.
అన్నప్రసాదాలను స్వీకరించే భక్తులు అధిక సమయం వేచివుండకుండా ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లు చేస్తుండాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో మర్యాదతతో మెలగాలని అన్నప్రసాద వితరణ సిబ్బందిని ఆదేశించారు