ప్రశాంతంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవం -డి.జి.పి అనురాగ్ శర్మ
లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొంటున్న గణేష్ నిమజ్జనం రేపటి వరకు కొనసాగే అవకాశం వుందని రాస్త్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ అన్నారు. గురువారం ఉదయం నుండి భారీగా వర్షం పడుతున్నప్పటికీ అనేక మండపాల నుండి గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రారంభం అయిందని ట్యాంక్ బ్యాండ్ తో పాటుగా తమకు దగ్గరలోని చెరువుల్లో ప్రజలు అనoదోత్సహాల మధ్య గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని అన్నారు. తన కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం నుండి గణేష్ నిమజ్జనం జరుగుతున్న అన్ని ప్రాంతాలను డి.జి.పి ఉన్నతాధికారులతో కలిసి చూసారు. అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయని నరసింహ రెడ్డి, పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డి,జి,పి అంజనీ కుమార్ తో కలిసి గణేష్ ఊరేగింపు జరుగుతున్నా ప్రాంతాలను హెలికాప్టర్ లో ఏరియల్ సర్వ్ చేసారు.
ఈ సందర్భంగా డి.జి.పి మాట్లాడుతూ, ఖైరతాబాద్ గణేశుడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ట్యాంక్ బ్యాండ్ లో నిమజ్జనం చేసారని, సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1248 గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసారని, గురువారం రాత్రి మొత్తం కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలి వస్తూనే ఉంటాయని, రేపు మధ్యాహ్నం వరకు దాదాపుగా అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తికావచ్చని డి.జి.పి తెలిపారు. జంట నగరాల్లో ప్రధానమైన విగ్రహాలు మొత్తం 11,074 ఏర్పాటు చేయగా, ఈ రాత్రి ఐదువేల వరకు విగ్రహాలు నిమజ్జనం కావచ్చని, రేపు కూడా విగ్రహాల నిమజ్జనం జరుగుతూనే ఉంటుందని డి.జి.పి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు రిపోర్ట్ కాలేదని, పోలీసులు ప్రజలతో మంచి సంయవనం పాటిస్తూ గణేష్ విగ్రహాల ఊరేగింపు చక్కని శాంతి భద్రతల మధ్య జరుగుతున్నదని డి.జి.పి అనురాగ్ శర్మ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 12 వేల సి.సి. , వీడియో కేమరాల ద్వార సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం నుండి గణేష్ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్న అన్ని ప్రాంతాలను పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని, అసాంఘీక శక్తులు కనబడితే చెర్యలు తీసుకోవడo కోసం వెంటనే దగ్గరలోని పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు.
సీనియర్ పోలీస్ అధికారులతో పాటుగా 25 వేల మంది పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటున్నారని వీరితో పాటుగా వివిధ విభాగాలకు చెందిన 13 కేంద్ర పోలీస్ బలగాలు కూడా నిమజ్జనోత్సం సందర్భంగా శాంతి భద్రతల విధుల్లో పనిచేస్తున్నారని డి.జి.పి తెలిపారు.