సున్నిపెంట/నంద్యాల:-ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సున్నిపెంటలోని తాసిల్దార్ కార్యాలయం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు చదివి అధికారి లాగిన్ లో తప్పనిసరిగా ఆమోదించడంతో పాటు వితిన్ ఎస్ఎల్ఎలోగా నాణ్యతతో పరిష్కరించాలని తెలిపారు. రీ ఓపెన్ అయిన దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. సీఎమ్ఓ కార్యాలయము, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల నుంచి వచ్చిన అర్జీలకు అధికారులు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కింది స్థాయి అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన ఎండార్స్మెంట్లను జిల్లా స్థాయి అధికారులు చదివి సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకొని ఆడిట్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పి4 సర్వే, మిస్సింగ్ హౌస్ హోల్డ్ డేటా, ఎంఎస్ ఎంఈ సర్వే, చిల్డ్రన్ ఆధార్ అప్డేట్ లను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పారామీటర్లలో బనగానపల్లి, బేతంచెర్ల, సిరివెళ్ల మండలాలు వెనుకబడి ఉన్నాయని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెండింగ్లో ఉన్న సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పిజిఆర్ఎస్ కార్యక్రమంలో 168 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత కాల పరిమితులోగా పరిష్కరించాలని ఎండార్స్ చేస్తూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.