తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ సాహితీ రంగ ప్రముఖులకే గాక విద్యార్థులకు, సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది. కేవలం నెలలు, తేదీలు మాత్రమే కాకుండా క్యాలెండర్ లో ఆయా నెలలలో జన్మించిన తెలంగాణ సాహితీ దిగ్గజాల పుట్టిన తేదీలు, చిత్రాలు, ప్రజా బాహుళ్యం చెందిన కవిత పంక్తులు, వ్యాఖ్యానాలు వాటి ప్రత్యేకతలను గురించిన సమాచారం పొందుపరిచారు. ప్రతి నెలలో పై భాగం లో ఇచ్చిన వ్యాఖ్యానాలు తెలంగాణ సాహితీ దిగ్గజాల విశిష్టతలను తెలిపాయి. క్రింది భాగంలో ప్రస్తావించిన quotation లాంటి కవితా పంక్తులు, తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, ఉద్యమ స్పూర్తిని ప్రతి ఫలిస్తాయి.
సాహిత్య అకాడమి ప్రచురించిన ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు ఆవిష్కరించారని అకాడమి కార్యదర్శి నామోజు బాలాచారి తెలిపారు. ప్రతి నెలలో సాహిత్య, సాంస్కృతిక రంగ ప్రముఖుల సమాచారం కలిగిఉన్న ఈ క్యాలెండర్ కు కవులు, రచయితలు, కళాకారుల నుండి మంచి స్పందన వస్తోందని బాలాచారి తెలియ చేశారు.