శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరగునున్నాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం మధ్యాహ్నం కార్యనిర్వహణాధికారి దేవస్థాన రక్షిత మంచినీటి సరఫరాను, నిర్మాణంలో ఉన్న మినీ కల్యాణకట్ట, పలు పార్కింగ్ ప్రదేశాలు, గణేశ సదన్ ఎదురుగా గల సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, సి.ఆర్.ఓ వద్దగల పార్కింగ్ ప్రదేశం మొదలైనవాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రక్షిత మంచినీటి సరఫరా పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. శుద్ధజలాన్ని అందించే విషయమై పూర్తి శాస్త్రీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి క్లోరినేషన్ ప్రక్రియపై శ్రద్ధ వహించాలన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా మంచి నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మంచినీటి సరఫరా ఉండాలన్నారు.
ముఖ్యంగా నీటికాలుష్యం వలన ఏర్పడే రోగాలను నివారించేందుకు మంచినీటిని శుభ్రపరిచే విధానంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాలలో గల మంచినీటి ట్యాంకుల నిర్వహణ పట్ల కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు.అనంతరం గణేశసదనం ఎదురుగా మిని కల్యాణకట్టను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజులలోగా మిని కల్యాణకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఆ తరువాత సెంట్రల్ పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు.
పార్కింగ్ ప్రదేశం వద్ద మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అదేవిధంగా తగినంత మేరకు లైటింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు.
తరువాత సి.ఆర్.ఓ ప్రక్కగల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఈ పార్కింగ్లో లడ్డూ ప్రసాదాల విక్రయం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పలుచోట్ల ప్రసాదాల విక్రయ కేంద్రాలను ఏర్పాట్లు చేయడం వలన భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీబాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీర్లు వి.రాజేశ్వర రావు తదితరులు ఉన్నారు.