మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండాలి-ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండాలని ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌ సూచించారు.  ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.ఈ సందర్భంగా దేవదాయశాఖ చీఫ్‌ ఫెప్టివల్‌ ఆఫీసర్‌గా నియమితులైన దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావుతో కలిసి సోమవారం  సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు, మంచినీటిసరఫరా, పాతాళగంగలో
పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, భక్తులు తలనీలాలు సమర్పించేందుకు చేయాల్సినఏర్పాట్లు, ట్రాఫిక్‌
క్రమబద్దీకరణ, వైద్యఆరోగ్యసేవలు, వాహనాల పార్కింగ్‌, పారిశుద్ధ్యం ఏర్పాట్లు మొదలైన అంశాల
గురించి చర్చించారు.

సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి  ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ
బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేపట్టిన ఆయా ఏర్పాట్లను వివరించారు.

తరువాత ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌ మాట్లాడుతూ
ఉత్సవాలలోఆయా కైంకర్యాల నిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా
ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి కొరత లేకుండా  మంచినీటి సరఫరా
ఉండాలన్నారు. కాలిబాట మార్గములో మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్పాలన్నారు. భక్తుల
కాలిబాట మార్గంలోని హాటకేశ్వరం వద్ద భక్తులు  స్నానాలాచరించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు
చేయాలన్నారు. హాటకేశ్వరం వద్ద జల్లుస్నానానికి ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంకంటే ముందస్తుగానే భక్తులు కాలిబాటమార్గంలో
క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుందని చెబుతూ ఉత్సవాల ముందురోజుల నుంచే కైలాసద్వారంలో
దేవస్థానం నుంచి అన్నప్రసాద వితరణ ఏర్పాటు ఉండాలన్నారు.పాతాళగంగలో భక్తులుపుణ్యస్నానాలు చేసేందుకు ఆయా ఏర్పాట్లన్ని పకడ్బందీగా
ఉండాలన్నారు.

-. పాతాళగంగ స్నానఘట్టాల ఎగువ ప్రాంతంలో కూడా జల్లు స్నానాలకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.దర్శన ఏర్పాట్ల గురించి చర్చిస్తూ భక్తులు క్యూలైన్లలో అధిక సమయం వేచివుండకుండా ఉండేవిధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూకాంప్లెక్స్‌ లో వేచివుండే భక్తులకు మంచినీరు,అల్పాహారం, బిస్కెట్లు క్రమం తప్పకుండా అందిస్తుండాలన్నారు. శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడి సమర్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు
పకడ్బందీగా ఉండాలన్నారు. ఎప్పటివలనే దీక్షా భక్తుల దర్శనాలకు తగు ఏర్పాట్లు ఉండాలన్నారు.క్షేత్రపరిధిలో అవసరమైన అన్నిచోట్ల కూడా సమాచారబోర్డులు, సూచిక బోర్డులు అధికసంఖ్యలో ఉండాలన్నారు.

క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవిధంగా తగు ఏర్పాట్లు
ఉండాలన్నారు. ముఖ్యంగా చెత్తచెదారాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా తగు సిబ్బందిని ఏర్పాటు
చేసుకోవాలన్నారు.అన్ని శౌచాలయాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు.
శౌచాలయాల వద్ద నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.ముఖ్యంగా ఆయా కూడళ్ళ నుంచి పార్కింగు ప్రదేశాలకు సూచించే మార్గసూచికలను
అధికంగా ఏర్పాటు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాలలో తెలుగురాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక నుంచి కూడా అధికసంఖ్యలో
భక్తులు క్షేత్రానికి విచ్చేస్తుంటారని, కాబట్టి తాత్కాలిక సమాచార కేంద్రాలలో సమాచారాన్ని అందించే
శివసేవకులను తెలుగు ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఏర్పాటు చేయాలన్నారు.
దీనివలన సమాచార కేంద్రాలలో భాషాపరమైన ఇబ్బందులు ఉండవన్నారు.

భక్తులకు వైద్యఆరోగ్యసేవలను అందించడం పట్ల తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
దేవస్థానం వైద్యశాలలో తగినన్నీ జెషధాలను ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గుండె
జబ్బులు మొదలైనవాటికి సంబంధించిన అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండాలన్నారు.

అదేవిధంగా జిల్లా వైద్యశాఖ సమన్వయంతో ఏర్పాటు చేసే వైద్యశిబిరాలలో కూడా
అవసరమైన జౌషధాలు అందుబాటులో ఉండేవిధంగా దేవస్థానం వైద్యవిభాగం తగు సమన్వయం
చేసుకోవాలన్నారు.ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు,
భజనలు మొదలైనవాటిని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన
ధర్మప్రచారానికి అవకాశం కలుగుతుందన్నారు.

దేవస్థానం గదులు, కాటేజీలు, డార్మిటరీలలో అన్ని సదుపాయాలు సజావుగా ఉండేటట్లుగా
జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తనిఖీ జాబితాను ( చెక్‌ లిస్టు)
రూపొందించుకుని సంబంధిత అధికారులు తగు పర్యవేక్షణ చేయాలని వసతి విభాగాన్ని
ఆదేశించారు.సంబంధిత జిల్లా అధికారులతో
ఎప్పటికప్పుడు తగు సమన్వయం చేసుకోవాలన్నారు.ఉత్సవాలలో భక్తులకు ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా తగు సమాచారాన్ని అందించేందుకు
ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకోవాలన్నారు.ఉత్సవాలలో స్వచ్చందసేవలు నిర్వహించే శివసేవకులకు దేవస్థానం నుంచి ముందస్తుగా
ఆయా సూచనలను – సలహాలను అందజేయాలన్నారు.

ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, సీనియర్‌ వేదపండితులు, అధ్యాపక
( స్థానాచార్య డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు, అన్ని శాఖాధిపతులు, ఆయా
విభాగాల పర్యవేక్షకులు, డిప్యూటీ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి ముందు చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌,
కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు సంబంధిత సిబ్బందితో కలిసి కైలాసద్వారం, హాటకేశ్వరం
తదితర చోట్ల ఆయా ఏర్పాట్లను పరిశీలించారు.

సమావేశానంతరం లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాలు, దర్శనం క్యూలైన్లు, క్యూకాంప్లెక్సు,
మొదలైనవాటిని పరిశీలించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.