ఏనుగుల చెరువు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

.

శ్రీశైల దేవస్థానం:స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఆదివారం  ఏనుగుల చెరువు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు

మనఊరు – మనగుడి మన బాధ్యత స్వచ్ఛందసేవాసంస్థ, నంద్యాల జిల్లా విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సంస్థకు చెందిన సుమారు 180 మందికి పైగా స్వచ్ఛందసేవకులు స్వచ్ఛతా కార్యక్రమాలకు

హాజరయ్యారు. ఈ స్వచ్ఛందసేవా సంస్థవారు శనివారం  ఘంటామఠం ప్రాంగణం, గంగాభవానీ స్నానఘట్టాలు, పాతాళగంగ స్నానఘట్టాలు, శిఖరేశ్వరాలయం వద్ద  పుష్కరిణి మొదలైన చోట్ల ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వచ్ఛతా కార్యక్రమములో ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీశైలం లక్ష్యసాధనలో భాగంగా క్షేత్రపరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో భాగంగానే మనఊరు మనగుడి – మన బాధ్యత సంస్థ వారిచేత ఈ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహింపజేయడం జరిగిందన్నారు. ఆ సంస్థ స్వచ్ఛంద సేవకులందరు కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం తరుపున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతోనే క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం వీలవుతుందన్నారు.

ప్రతి గురువారం కూడా క్షేత్రపరిధిలో ఈ విస్తృత పారిశుద్ధ్యకార్యక్రమం వుంటుందన్నారు. దేవస్థానం సిబ్బందితో పాటు స్థానికులందరు కూడా ఈ కార్యక్రమములో పాల్గొని స్వచ్ఛ శ్రీశైల కార్యక్రమానికి సహకరించాలన్నారు.

పారిశుద్ధ్య కార్యక్రమానికి  క్షేత్రపరిధిలో క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 66 ప్రదేశాలుగా విభజించారు.

కాగా ఇప్పటికే మనఊరు మన బాధ్యత స్వచ్ఛందసేవాసంస్థ, నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు ఇతర రాష్ట్రాలలోని 123 ఆలయాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆ సంస్థ వ్యవస్థాపకులు యం.వి శివ కుమార్ రెడ్డి తెలియజేశారు. మన రాష్ట్రంలోని అహోబిళం, కసాపురం, ఒంటిమిట్ట, కాల్వబుగ్గ, మంత్రాలయం తదితర క్షేత్రాలలో ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు..

ఈ రోజు జరిగిన స్వచ్ఛత కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

మనఊరు – మనగుడి – మన బాధ్యత స్వచ్ఛందసేవకులకు కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు వృక్షప్రసాదంగా ఉసిరి, బిల్వం మొక్కలను అందజేశారు.
ఈ వితరణ కార్యక్రమములో ఉద్యానవన అధికారి ఎస్. లోకేష్, ఉద్యానవన సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.