శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,39,61,457/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 23 రోజులలో (17.12.2024 నుండి 08.01.2025 వరకు) సమర్పించారని వివరించారు.
ఈ నగదుతో పాటు 139 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 400 గ్రాముల వెండి లభించాయని తెలిపారు.
అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 481, కెనడా డాలర్లు 35, సింగపూర్ డాలర్లు -60, యూకే ఫౌండ్స్ – 20, మలేషియా రింగిట్స్ – 15, కత్తారు రియాల్స్ – 4.5, యూఏఈ దిర్హము – 140, ఆస్ట్రేలియా డాలర్లు – 60, జపాన్ యన్స్ – 1, సౌదీ అరేబియా – 50, రోమనియ లియాస్ 10, ఉగండా షిల్లింగ్స్ – 2,000, ఓమన్ బైసా – 600, ఈరోస్ – 10
లభించాయని తెలిపారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందన్నారు.
కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తో పాటు డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం. రమణమ్మ, యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.