శ్రీశైల దేవస్థానం:* సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ ఓ శ్రీనివాస రావు గురువారం మీడియాకు తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రములో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
* మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు , మహాశివరాత్రి సందర్భంగా
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
* మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నికదీక్షతో 7 రోజులపాటు జరుగుతాయి.
* మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నికదీక్షతో 11రోజులపాటు జరుగుతాయి.
* ఈ సంవత్సరం జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
* లోకకల్యాణం కోసం జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి
విశేషపూజలు, శ్రీభ్రమరాంబాదేవిఅమ్మవారికి విశేష అర్చనలు, హోమాలు, మూలమంత్ర జపాలు,
పారాయణలు జరుగుతాయి.
* మొదటిరోజు (11న ) ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు
ప్రారంభమవుతాయి.
* అదేరోజు సాయంత్రం అంకురార్పణ తరువాత ధ్వజారోహణ
నిర్వహిస్తారు.
* ఉత్సవాలలో రెండవ రోజు నుంచి స్వామిఅమ్మవార్లకు ఆయా వాహనసేవలు
జరుగుతాయి.
* 12వ తేదీ నుంచి వరుసగా భృంగివాహనం, కైలాసవాహనసేవ, నందివాహనం, రావణవాహన
సేవలు వుంటాయి.
* మకరసంక్రాంతి రోజున( 14వ తేదీన) బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
* ఈ బ్రహ్మోత్సవ కల్యాణానికి స్థానిక చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానం.
* శ్రీశైల సంస్కృతీ సంప్రదాయాలలో చెంచు గిరిజనులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. చెంచులు
అమ్మవారిని తమ కుమార్తెగా, స్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. మల్లయ్యా, మల్లన్నా అని
వారు ఎంతో ఆప్యాయంగా స్వామివారిని భక్తితో పలుకుతారు.
* 16వ తేదీన ఉదయం యాగ పూర్జాహుతి, త్రిశూలస్నానం, ఆరోజు సాయంత్రం సదస్యం,
వేదశ్రవణం, నాగవల్లి, ధ్వజావరోహణ ఉంటాయి.
* బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన 17వతేదీన అశ్వవాహనసేవ, పుష్ట్పోత్సవం, శయనోత్సవం
జరుగుతాయి.
భోగిరోజున ఉదయం గంగాధర మండపం వద్ద భోగిమంటలు వేస్తారు.
* ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భోగిరోజున సామూహిక భోగిపండ్ల
కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భోగిపండ్ల కార్యక్రమములో పాల్గొనదలచిన వారు 12వ తేదీ
సాయంత్రంలోగా తమ పేర్లను ప్రజాసంబంధాల విభాగంలో నమోదు చేసుకోవలసివుంటుంది.
* అదేవిధంగా జనవరి 14వ తేది సంక్రాంతిరోజున మహిళలకు ముగ్గులపోటీలను నిర్వహణ.
ఆలయ దక్షిణమాడవీధిలో ఈ ముగ్గుల పోటీలు జరిపించబడుతాయి. ఆసక్తి గలవారు 13వ తేదీ
సాయంత్రంలోగా తమ పేర్లను ప్రజాసంబంధాల విభాగంలో నమోదు చేసుకోవలసివుంటుంది.
* కనుమ రోజున సంప్రదాయబద్ధంగా గో పూజను నిర్వహిస్తారు.
* ఉత్సవాల సందర్భంగాఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఆర్జిత మరియు ప్రత్యక్ష పరోక్షసేవలైన
రుద్రహోమం, మృత్యుంజయహోమం, గణపతిహోమం (పరోక్షసేవ) శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి
కల్యాణం మరియు శ్రీ స్వామిఅమ్మవార్లకల్యాణం, ఏకాంతసేవలను మరియు ఉదయాస్తమానసేవ,
ప్రదోషకాలసేవ, ప్రాతకాలసేవలు నిలపుదల చేస్తారు.