శ్రద్ధగా పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం

శ్రీశైలంలో   శ్రద్ధగా పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం: *క్షేత్రంలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు *పారిశుద్ధ్య కార్యక్రమానికి  క్షేత్ర పరిధిని 6 జోన్లు , 11 సెక్టార్లుగా విభజన *మొత్తం 66 ప్రదేశాలలో పారిశుద్ధ్య చర్యలు

స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా బుధవారం  క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతీ జోనుకు కూడా దేవస్థానం యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అదేవిధంగా ఆయా జోన్లలో పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. దాదాపు అన్ని విభాగాల సిబ్బంది కూడా ఈ ప్రత్యేక విధులలో పాల్గొన్నారు.

 పలు ప్రధాన రహదారులు ఆలయమాడవీధులు, గంగాధరమండపం నుంచి తూర్పువైపున నందిగుడి వరకు గల ప్రదేశం, దక్షిణం వైపున అలంకారేశ్వరాలయం  ప్రదేశం, దర్శన క్యూకాంప్లెక్సు, విరాళాల సేకరణ కేంద్ర ప్రాంగణం , పరిసరాలు, అన్నప్రసాద వితరణ భవన పరిసరాలు, సి.ఆర్.ఓ కార్యాలయ పరిసరాలు, దేవస్థానం వైద్యశాల పరిసరాలు, గంగాగౌరీసదన్ పరిసరాలు, మల్లికార్జునసదన్ పరిసరాలు, గణేశసదన్ పరిసరాలు, టూరిస్ట్ బస్టాండ్ పరిసరాలు, సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, మల్లమ్మ కన్నీరు పరిసరాలు, పంచమఠాల పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిసరాలు, సర్వతోభద్రవన పరిసరాలు, కల్యాణకట్ట పరిసరాలు, పాతాళగంగ పాతమెట్ల మార్గం, ఆర్టీసి బస్టాండు, సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం, పాతాళగంగమెట్లమార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, భ్రమరాంబా అతిథిగృహ పరిసరాలు, సాక్షిగణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వరాలయ పరిసరాలు, ఫాలధార పంచధార, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు మొదలైన 66 చోట్ల పారిశుద్ధ్య చర్యలు జరిగాయి.

 దేవస్థానం సిబ్బందితో పాటు పలువురు శివసేవకులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.