శ్రీశైల దేవస్థానం:శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు , ఆయా ఆర్జిత సేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది.
వసతిని ఆన్లైన్లో రిజర్వు చేసుకునేందుకు , అన్ని ఆర్జిత సేవా టికెట్లు, శ్రీస్వామివార్ల స్పర్శ దర్శనం టికెట్లు, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం మొదలైన అన్ని టికెట్లను ఆన్లైన్లో పొందేందుకు భక్తులు దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.srisailadevasthanam.org లేదా దేవాదాయశాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in లను మాత్రమే వినియోగించుకోవలసినదిగా దేవస్థానం కోరింది.
దేవస్థాన, దేవాదాయశాఖ వెబ్సైట్ కాకుండా భక్తులు ఇతర నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని దేవస్థానం సూచించింది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 8333901351 / 52 / 53 / లను సంప్రదించవచ్చును.