హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(TUWJ) ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ దేశోద్ధారక భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు- ఏడాది పాలన అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, ప్రజా కళాకారుడు మాస్టర్ జీ,ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బిబి రావు , డాక్టర్ వినయ్, సజయ, సామాజికవేత్త పద్మజా షా, కోవా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మజ్జహర్ హుస్సేన్, అప్స స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.