కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియాతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన ఈ ఓ ఎం. శ్రీనివాసరావు

శ్రీశైల దేవస్థానం : కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శుక్రవారం  జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ని నంద్యాలలోని కలెక్టర్  కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.
అదేవిధంగా జిల్లా ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్  సి. విష్ణు చరణ్‌లను కూడా కార్యనిర్వహణాధికారి మర్యాదపూర్వకంగా కలిశారు.అధికారులందరికీ స్వామివార్ల ప్రసాదం, 2025 సంవత్సరపు డైరీ, క్యాలెండర్లు కూడా అందించారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ వేదపండితులు గంటిరాధకృష్ణశర్మ, అర్చకస్వాములు, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.