శ్రీశైలదేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం కార్తికమాసమంతా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు మార్గశిర శుద్ధ పాడ్యమి అయిన సోమవారంతో ముగిసాయి.
కార్తిక శుద్ధపాడ్యమి (02.11.2024) రోజున ప్రారంభించిన ఈ భజన కార్యక్రమంలో కార్తికమాసమంత కూడా నిరంతరంగా రేయింబవళ్ళు అఖండ శివపంచాక్షరి నామభజనను జరిగింది.
ఈ భజనలలో కర్నూలు జిల్లాకు చెందిన రెండు భజన బృందాలకు , కర్ణాటకకు చెందిన నాలుగు భజన బృందాలకు అవకాశం కల్పించారు. శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి, కర్నూలు ( 02.11.2024 నుండి 07.11.2024), శ్రీ చెన్నకేశవ నాటక కళాభజన మండలి, కర్నూలు ( 07.11.2024 నుండి 12.11.2024), శ్రీశైలమల్లికార్జున భజన సంఘం, బళ్ళారి, కర్ణాటక రాష్ట్రం ( 12.11.2024 నుండి 17.11.2024) శ్రీ మౌళీ బసవేశ్వర భజన సంఘ్, గోపనదేవరహళ్ళి, రాయచూర్ జిల్లా (17.11.2024 నుండి 22.11.2024), శ్రీ మల్లికార్జున భజన మండలి, సుమ్కేశ్వారాహాల్, రాయచూర్ జిల్లా, కర్ణాటక ( 22.11.2024 నుండి 27.11.2024) శ్రీ ప్రభులింగ సేవా సంఘ్, గోపానదేవరహళ్ళి, రాయచూర్ (27.11.2024 నుండి 02.12.2024), వారు భజనలను చేశారు.
ఈ నాటి ముగింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.
*అలరించిన సహస్ర దీపాలంకరణ సేవ
*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,11,111/-లను టి. నరహరి గౌడ్, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.