శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం మైత్రీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, చెన్నె సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపతిం, గురు నవనీతం, భ్రమరాంబాష్టకం, తాండవ నృత్యకరి, భో… శంభో, చక్కని మా శివయ్య తదితర గీతాలకు అరుణ్ కుమార్, గాయత్రి ఆనంద్, సి.జి. అభినయ, యువశ్రీ, తనూశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది।