ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలి

హైదరాబాద్ HICC లో AI గ్లోబల్ సమ్మిట్ 2024 కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కారక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

  • వివిధ దేశాల నుంచి సదస్సుకు హాజరైన 2వేల మంది ప్రతినిధులు.
  • ఇవాళ, రేపు రెండు రోజులపాటు కొనసాగనున్న AI గ్లోబల్ సమ్మిట్ .
  • “Making AI work for every one” అనే థీమ్ తో సదస్సు నిర్వహణ.తొలిసారిగా హైదరాబాద్ లో AI గ్లోబల్ సమ్మిట్
  • HICC లో ముఖ్యమంత్రితో J-PAL గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలివాల్ భేటీ. ఏఐ రంగం అభివృద్ధిపై చర్చ..
  • HICC లో ముఖ్యమంత్రితో IBM వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబ్. AI లో భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చ.
  • HICC లో ముఖ్యమంత్రితో Yotta infrastructure solution LLP సీఈవో సునీల్ గుప్తా భేటీ.హైదరాబాద్ లో జీపీయూ ఆధారిత AI క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చ.
  • గ్లోబల్ సమ్మిట్ లో AI  రోడ్ మ్యాప్ ను  విడుదల చేసిన ముఖ్యమంత్రి.
  • రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AI రోడ్ మ్యాప్.
  • రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను పొందుపరిచిన ప్రభుత్వం.
  • AI స్టాల్స్ ను సందర్శించిన ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పీచ్  పాయింట్స్…

  • సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు.
  • మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారింది.
  • విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది.
  • ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ – ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి.
  • టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం.
  • ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
  • కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుంది.
  • అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం.
  • దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయాం.
  • భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్‌ సిటీలా మరీ సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు… భవిష్యత్తును సృష్టిస్తాం..
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు.
  • ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నాం.
  • ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నాం.
  • తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో మాకు సహకరిస్తాయి.
  • ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుంది.
  • హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం.
  • సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం
  • మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నా
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.