శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం మల్లాది అనూష , వారి బృందం, నెల్లూరు గాత్రకచేరి కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద గాత్రకచేరి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శివ శివ శంభో, కాలభైరవాష్టకం, ఆనందామృత, విజయాంబికే, సకల మంత్రముల, అంబావాణీ, గౌరీ మనోహర్, వినాయకుని వలెను, జయజయదేవి, మహిషాసురమర్థిని, శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి, కైలాసగిరివాసా, కాళింగనర్తన, దుర్గాదేవి దురితనివారిణి, కామకోటిపీఠవాసిని తదితర గీతాలను అష్టకాలను మల్లాది అనూష తదితరులు ఆలపించారు.
ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారాన్ని సుబ్రహ్మణ్యం, కీబోర్డు సహకారాన్ని సంగీత, మృదంగ సహకారాన్ని ఈశ్వర అందించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
