శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీధర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో గణేశపంచరత్నం, ఆనందతాండవం, కాలభైరవాష్టకం, శివతాండవం, మూషిక వాహన, మహిషాసురమర్ధిని పలు అష్టకాలకు, గీతాలకు పి. నాగశ్రీ, నందిని, భవిక, హర్షిత, దీక్షిత, వైష్ణవి, కుసుమ, అలేఖ్య, సౌజన్య తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.