ఉద్యోగులకు జీవన భద్రత కల్పించేదిశగా మోదీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. అనుకోకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం పోయి నిరుద్యోగులుగా మారినవారి కోసం రాజీవ్ శ్రామిక్ కళ్యాణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికరాజ్య బీమా సంస్థలో సభ్యునిగా ఉండి, ఏదేని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ మూతపడినపుడు, సంస్థలో ఉద్యోగులను తగ్గించినపుడు, ప్రమాదం కారణంగా నిరుద్యోగిగా మారితే రాజీవ్ శ్రామిక్ కళ్యాణ యోజన కింద ఏడాదిపాటు సగం వేతనాన్ని నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. ఈఎస్ఐసీలో కనీసం రెండేళ్ల సభ్యుడిగా ఉండి, నిరుద్యోగిగా మారినవారు ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారులు ఉద్యోగం పోయిన ఏడాదిలోగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.