
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పలువురు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయం అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.