శ్రీశైల దేవస్థానం:వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదివారం ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా పాలధార పంచదార వద్ద శంకర మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ అర్చకులు, వేదపండితులు మహాగణపతిపూజను నిర్వహించారు. తరువాత వేదమంత్రాలతో చంద్రమౌళీశ్వర స్వామివారికి, శ్రీ శారదాదేవికి, శంకరుల వారికి విశేషంగా అభిషేకం జరిపారు. పంచామృతాలతోనూ, వివిధ ఫలరసాలతోను, పుణ్య జలంతోను ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా జరిపారు. తరువాత పుష్పార్చన, మహానివేదనలను జరిగాయి.
కాగా శంకరుల వారికి శ్రీశైల మహాక్షేత్రానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. శంకరులవారు శ్రీశైలంలోని పాలధార పంచదార వద్ద కొంతకాలం తపస్సు చేసి ఇక్కడే తమ శివానందలహరి గ్రంథాన్ని వ్రాశారు.
ఈ పూజా కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, రెవెన్యూ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, సహాయ ప్రజా సంబంధాల అధికారి శివారెడ్డి, అర్చక స్వాములు, వేదపండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు
ప్రవచనం:
ఆదిశంకరచార్యుల జయంతిని పురస్కరించుకుని ఆ రోజు సాయంకాలం నిత్యకళారాదన వేదికపై ఆదిశంకరులవారి జీవిత విశేషాలపై ఉన్నవ గణేశ్, జిల్లెళ్ళమూడి, బాపట్ల జిల్లా ప్రవచనం చేసారు.
*RUDRAMOORTHI PUJALU performed in the temple.Archaka swaamulu performed the puuja. EO and others participated in the event.