బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెప్టెంబర్ 17పై ఫోటో ఎగ్జిబిషన్ ను సెప్టెంబర్ 11న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 11, 12న రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, బద్ధం బాల్ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.