రూ. 2 లక్షల మేరకు రుణ మాఫీ పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి – సి.ఎం రేవంత్ రెడ్డి

        హైదరాబాద్, డిసెంబర్ 11 :  రాష్ట్రంలోని రైతులందరికీ  రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో  జమ చేసే ప్రక్రియను  ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ పై  సోమవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి డా.బీఆర్.అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్,సహకార,హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర  రావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు హాజరయ్యారు.

దాదాపు మూడు  గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖా, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.  ఈ సందర్బంగా సి.ఎం.  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,  రైతులకు నేటి నుండే రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా  పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.

రూ. 2  లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి:

తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులను సి.ఎం. ఆదేశించారు.

ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి నిర్వహణ:

ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజావాణిగా పిలవాలని సి.ఎం ఆదేశించారు. ఈ ప్రజావాణి ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి   ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే  ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు  చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.