శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా పంచ సహస్రవధాని , ప్రముఖ ప్రవచకులు డా. మేడసాని మోహన్ ప్రవచనాలు ఏర్పాటు చేసారు.మూడు రోజులపాటు శివానందలహరి – భక్తితత్వంపై ప్రవచనాలు వుంటాయి.మంగళవారం ప్రారంభమైన ఈ ప్రవచనాలు 7వ తేదీతో ముగియనున్నాయి.
మంగళవారం ప్రవచనాలకు ముందు సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేసారు.మేడసాని మోహన్ తో పాటు కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసారు.
డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ శ్రీ ఆది శంకర భగవద్పాదులు వ్రాసిన శతాధిక గ్రంథాలలో శివానందలహరి ఎంతో ప్రసిద్ధమైందన్నారు. ఈ శివానందలహరి శివుణ్ణి ఆలంబనగా చేసుకుని వ్రాయబడిందన్నారు.ఈ శివానందలహరికి , శ్రీశైలమహాక్షేత్రానికి ఎంతో దగ్గర సంబంధం ఉందన్నారు.శంకరుల వారు శ్రీశైలమహాక్షేత్రంలో తపస్సు చేసే సమయంలో ఈ గ్రంథాన్ని వ్రాశారన్నారు. శివానందలహరిలో శంకరులవారు శ్రీశైల మహాక్షేత్రాన్ని, శ్రీమల్లికార్జునస్వామిని స్తుతించారన్నారు.భక్తులు శంకరాచార్య ప్రబోధాలను ఆకళింపు చేసుకోవాలన్నారు. భక్తులు త్రికరణశుద్ధిగా భగవంతుణ్ణి శరణువేడాలన్నారు. భగవంతుడు నిరంతరం భక్తులను కాపాడుతూనే ఉంటారన్నారు.
భక్తి తత్త్వానికి, ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన పలు అంశాలను కూడా డా. మేడసాని మోహన్ ప్రస్తావించారు. వివేకచూడామణి పేర్కొన్న అంశాలను శివానందలహరితో సమన్వయం చేస్తూ విశదీకరించారు. శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలను కూడా వివరించారు.
- *Bayalu Veerabhadra Swamy Pooja, Aaakaasha Deepam, Nandeeswara Pooja, kumaraswamy puuja performed in the temple.
* కార్తీకమాసంలో సాంస్కృతిక కార్యక్రమాలు:
దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దీవి హయగ్రీవాచార్లు, నంద్యాల , కార్తీకమాస విశిష్టతపై ప్రవచనం చేసారు.
అనంతరం రెండవ కార్యక్రమంలో భాగంగా N.C.R.T వారి సౌజన్యంతో ఎ భరణి , బృందం, హైద్రాబాద్ , సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసారు. ఈ కార్యక్రమంలో రాగిణి, సంయుక్త, నిత్యశ్రీ, శ్వేత, మానస, వైష్ణవి, శ్లోక తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.