శ్రీశైల క్షేత్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఓ ఆదేశాలు

 శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం దేవస్థానం  కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు  సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రదేశాలు  పరిశీలించారు.

రోడ్లు భవనాలశాఖ అతిథిగృహ కూడలి, ఘంటామఠం కూడలి, విభూతిమఠం కూడలి, వలయరహదారి, పాతాళగంగరోడ్డు, పాతాళగంగ పాతమెట్ల రోడ్డు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మొదలైన ప్రదేశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం కూడలి వద్ద వీలైనంత మేరకు రహదారిని ఇరువైపులా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  రుద్రాక్షమఠం, విభూతిమఠం వద్దగల కూడళ్ళ వద్ద గల రహదారిని విస్తరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.రుద్రాక్షమఠం, విభూతిమఠం ప్రాంగణాల ముందు స్వల్ప విస్తీర్ణ ప్రదేశంలో ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ చేపట్టాలని ఉద్యానవన అధికారిని ఆదేశించారు.

భక్తులు సులభంగా ప్రవేశించేందుకు వీలుగా ఆలయ పుష్కరిణి సమీపంలో గల శంకరవనం( రాక్ గార్డెన్ ) దక్షిణభాగంలో కూడా ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ  ఆదేశించారు.క్షేత్రపరిధిలో రహదారికి ఇరువైపులా ఎప్పటికప్పుడు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి పిచ్చిమొక్కలను తొలగిస్తుండాలన్నారు. క్రమం తప్పకుండా ఈ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టాలన్నారు.

క్షేత్రపరిధిలోని అన్ని  కూడళ్ళ వద్ద ఆయా దారులు తెలిసేవిధంగా మరిన్ని సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ. ఈ కూడళ్ళలో ఆయా మార్గ సూచికలు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా కాంటిలివర్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అన్ని  కూడళ్ళ వద్ద తగిన మేరకు విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు.

భక్తుల సౌకర్యార్థమై రోడ్లు భవనాల అతిథిగృహం సమీపం ప్రాంతంలో అనువైనచోట జల్లుస్నానానికి ( షవర్బత్) తగు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ ఓ. రద్దీరోజులలో ముఖ్యంగా మహాశివరాత్రి, ఉగాది మహోత్సవాలలోనూ ఈ జల్లు స్నానం ఏర్పాటు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.యాంఫీథియేటర్ ఎడమవైపు ప్రదేశంలో అనగా మల్లమ్మకన్నీరు ఎదురుగా గల కూడలిలో  ట్రాఫిక్ ఐలెండ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

తరువాత సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంటును పరిశీలించారు. ఈ ప్లాంటు వద్ద 2లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపు నిర్మాణానికి తగు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు.అదేవిధంగా దేవస్థాన రవాణశాఖ వాహనాల నిర్వహణకు గాను మిని గ్యారేజ్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.క్షేత్రపరిధిలో మరిన్నిచోట్ల వాహనాల పార్కింగు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, జి. మురళీధర్రెడ్డి, సివిల్ విభాగపు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ /సి) చంద్రశేఖరశాస్త్రి, ఎలక్ట్రికల్ విభాగపు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ / సి) పి.వి. సుబ్బారెడ్డి, పర్యవేక్షకులు అయ్యన్న, అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, భవన్ కుమార్, సీతారమేష్, ఉద్యానవనాల విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ జి. ఈశ్వరరెడ్డి, ఉద్యానవన అధికారి ఎస్. లోకేష్  , ఎడిటర్  డా. సి.అనిల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.