శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.
కార్యక్రమాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలదేవస్థానం , జాతీయ సాంస్కృతిక పరిశోధన , శిక్షణా సంస్థ (National Cultural Research and Training centre), దక్షిణప్రాంతీయ కేంద్రం, బెంగళూరు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నారు. మరికొన్ని కార్యక్రమాలు దేవస్థానం పక్షాన ఏర్పాటు చేసారు.
ఈ రోజు N.C.R.T సౌజన్యంతో ప్రఖ్యాత నాట్యకళాకారులు ఆర్ చంద్రశేఖర్ , బృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చింది. గిరి, మనశ్రీ, గౌతమి, హెచ్. సాయిశ్రీ, సంశ్రీప్రియ, సిరిచందన, అక్షరవర్షణి, శరణ్య తదితరులు నృత్య ప్రదర్శన చేసారు. రెండవ కార్యక్రమములో భాగంగా N.C.R.T వారి సౌజన్యంతో ప్రఖ్యాత నాట్యకళాకారులు డా. గిరీష్ , బృందం వారిచే భరతనాట్యం కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమములో ఆత్మిక, సహశ్రీ, స్మిత, అక్షయ, తన్వీ, తన్వీశ్రీ, లీనస్మిత తదితరులు నృత్యప్రదర్శన చేసారు.
అనంతరం దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పి. రజనీ కాంత్ , బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.