శ్రీశైలం – కాశీ క్షేత్రాలు వేదంలోని నమకం చమకం లాంటివి-బ్రహ్మశ్రీ మాడుగుల

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు

చేసారు.ఇందులో భాగంగా గురువారం  దేవస్థానం బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వారిచే ‘నమక, చమక వైభవం’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా మాడుగుల నాగఫణిశర్మ   మాట్లాడుతూ శ్రీశైలం – కాశీక్షేత్రాలు వేదంలోని నమకం చమకం లాంటివి అన్నారు.రుద్రం అంటే నమకచమకాల కలయిక అన్నారు. ఈ రుద్రమంత్రాలతో శివలింగంపై సంతతధారగా జలాన్ని పోయడాన్నే రుద్రాభిషేకం అంటారన్నారు. నమకం అనేది శివుని యొక్క సకల దేవతాస్వరూపాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. చమకం అనేది ఈ విశ్వమంతా రుద్రుడు ఉన్నాడనే తత్త్వాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ నమనచమకాలను కేవలం ఎవరైతే భక్తితో వింటారో, పఠిస్తారో అటువంటి వారికి ఇహపర సౌఖ్యాలు తప్పక లభిస్తాయన్నారు. ఈ నమకచమకాల మంత్ర విశేషాలను తెలియజెప్పినందువల్లే యజుర్వేదం భగవంతుని శిరస్సుగా కీర్తించబడిందన్నారు.జ్యోతిర్లింగం, మహాశక్తి స్వరూపిణి ఒకే ఆలయ ప్రాంగణంలో వెలసిన ఏకైక క్షేత్రం శ్రీశైలమన్నారు. శ్రీశైలక్షేత్రంలో కేవలం ఒక్కరోజు నివసించినంత మాత్రాన ఇహంలో అప్టైశ్వర్యాలు, పరంలో మోక్షం లభిస్తుందన్నారు.

 ఈ క్షేత్రంలో చేసే జపపారాయణలు విశేష ఫలితాన్నిస్తాయన్నారు  మాడుగుల. 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.