ఘనఘనంగా శ్రీశైల దేవస్థానం కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

శ్రీశైలదేవస్థానం: కార్తీక మాసోత్సవాలు మంగళవారం  ఘనంగా  ప్రారంభమయ్యాయి. ఈ కార్తీక మాసోత్సవ

నిర్వహణకు వివిధ  ఏర్పాట్లు జరిగాయి.భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, స్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, పారిశుద్ధ్యం, సోమవారాలు, లక్ష దీపోత్సవం, పుష్కరిణి  హారతి, కార్తీక పౌర్ణమిరోజున జ్వాలాతోరణోత్సవం,నదీహారతి మొదలైన వాటికి సంబంధించి పలు ఏర్పాట్లు జరిగాయి.

సిబ్బందికి ప్రత్యేక విధులు :

భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తిక మాసంలో రద్ధీరోజులలో  కార్యాలయ సిబ్బందికి
ప్రత్యేక విధులు కేటాయించారు.

దర్శనం ఏర్పాట్లు :

వేకువ జామున గం.3.00లకు ఆలయ ద్వారాలు తెరచి, ప్రాతఃకాల పూజల అనంతరం వేకువ జామున
గం. 4.30ల నుంచి సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు కల్పిస్తున్నారు.
అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 1100ల వరకు దర్శనాలు
కొనసాగుతాయి.

రెండు విడతలుగా ఆర్జిత చండీ హోమము , రుద్రహోమం జరుగుతాయి.

క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందిస్తున్నారు.
భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసంలో శ్రీస్వామివారి
గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేసారు.
అదేవిధంగా భక్తులు రద్దీ రోజులలో ( మొత్తం  13 రోజులు) శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం
కూడా నిలుపుదల చేసారు. ఈ రోజులలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.

సాధారణ రోజులలో రోజుకు నాలుగు విడతలు శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి వీలు
వుంది.ఈ స్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

లడ్డు ప్రసాదాలు :

కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు
సిద్ధం చేస్తున్నారు.

పుష్కరిణి వద్ద లక్షదీపార్చ్సన , పుష్కరిణి హారతి:
కార్తీక సోమవారాలలో , పౌర్ణమి రోజున “పుష్కరిణి * వద్ద లక్ష దీపోత్సవం ,
పుష్కరిణి హారతి కార్యక్రమాలు వుంటాయి.

కార్తీకదీపోత్సవం:

* భక్తులు కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర శివవీధి [మాడవీధి) ,
గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

పుణ్యనదీ హారతి:

* కార్తీక పౌర్ణమి నవంబరు 27 తేదీ అయినప్పటికీ, ఆ ముందురోజు అనగా 26వ తేదీ ఆదివారం
రోజుననే ప్రదోష కాలంలో ( సాయంకాలానికి) పౌర్ణమి ఘడియలు వస్తాయి

* అందుకే 26వతేదీ సాయంకాలానే కృష్ణవేణి నదీమ తల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం
వుంటుంది.

* ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు, సారె సమర్పణ
చేస్తారు.

* అదేవిధంగా జ్వాలాతోరణ కార్యక్రమం కూడా 26వ తేదీ సాయంకాలాన నిర్వహిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు:

* ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం  శ్రీశైలదేవస్థానం , జాతీయ సాంస్కృతిక పరిశోధన ,శిక్షణ
సంస్థ  దక్షిణప్రాంతీయ కేంద్రం బెంగళూరు వారి సంయుక్త  నిర్వహణలో  పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
చేసారు.

* అదేవిధంగా దేవస్థానం పక్షాన కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద  ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

*ఈ రోజు  ఓరియంట్ సీమెంట్ లిమిటెడ్, దేవపూర్, మంచిర్యాల జిల్లా వారు ఒక లోడు సీమెంట్‌ను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,  బాలాజీరావు, సంబంధిత పత్రాలను ఆలయ ప్రాంగణములో కార్యనిర్వహణాధికారి పెద్దిరాజుకు అందజేశారు.
ఈ కార్యక్రమములో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, సీనియర్ స్వామివార్ల ప్రధానార్చకులు శివప్రసాద్ స్వామి, వేదపండితులు గంటిరాధకృష్ణ శర్మ అవధాని, తదితరులు ఉన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.