
శ్రీశైల దేవస్థానం: దేవస్థానానికి సోమవారం ఉదయ్ కుమార్ రెడ్డి, తిరుపతి , వాహనాన్ని విరాళంగా అందజేశారు.
ఉదయం గంగాధర మండపం వద్ద దాతలు ఈ వాహనాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి
డి.పెద్దిరాజు కు ఈ వాహనాన్ని అందించారు. ఈ వాహనం విలువ సుమారు
రూ. 15,00,000/-లు అని దాతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, ఎగ్జిక్యూటివ్
ఇంజనీరు రామకృష్ణ ఆలయ విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి మోహన్ తదితరులు
పాల్గొన్నారు.కార్యక్రమానంతరం దాతలకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు , లడ్డూప్రసాదాలను
అందించారు.