మహాగౌరి అలంకారం-నందివాహనసేవ

శ్రీశైల  దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు  ఆదివారం   ఉదయం అమ్మవారికి

ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య
నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్థానములు, చండీపారాయణ, చతుర్వేద
పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు.

అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి.సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.రాత్రి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు జరిగాయి.

కమారీపూజ:
దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.ఈ కుమారిపూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు.  కుమారిపూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం

మహాగౌరి అలంకారం:

నవదుర్గ అలంకారాలలో భాగంగా ఈ రోజు శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని మహాగౌరి స్వరూపంలో అలంకరించారు.  నవదుర్గ స్వరూపాలలో ఎనిమిదవ రూపం ఈ మహాగౌరి.దసరా మహోత్సవాలలో ఎనిమిదవ రోజున ఈ స్వరూపాన్ని పూజిన్చారు.

నవదుర్గలలో మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తిగా చెప్పబడుతోంది. ఈ దేవి తెల్లని వస్త్రాలను
ధరించి, చతుర్భుజాలను కలిగి ఉంటుంది. కుడివైపు పైభుజంలో త్రిశూలాన్ని క్రింది భుజంలో
అభయహస్తాన్ని. ఎడమవైపు పై భుజంలో వరముద్రను, క్రింది భుజంలో ఢమరుకాన్ని కలిగి ఉంటుంది.
మహాగౌరి తన పార్వతిరూపంలో పరమశివుని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేయసాగింది.

ఈ తపస్సు కారణంగా ఈమె శరీరమంతా నల్లబడింది. ఆ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఈమె
శరీరంపై గంగాజలాన్ని చిలకరించాడు. అప్పుడు ఆ దేవి తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారింది. అందుకే
ఈ దేవి మహాగౌరిగా పిలువబడింది. దసరా మహోత్సవాల ఎనిమిదవ రోజున ఈ దేవిని పూజిస్తారు.
ఈ దేవిని పూజించడం వలన సకల పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

:

ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు
నందివాహనసేవ నిర్వహించారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా
అలంకరింపజేసి, నందివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేసారు.

print

Post Comment

You May Have Missed