శ్రీశైలక్షేత్రంలో అణువణువునా దివ్యత్వం వ్యాపించి ఉంది-సామవేదం షణ్ముఖశర్మ
శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం 9 రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ చే ‘శ్రీశైల మహిమా విశేషాలు’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఆదివారం ప్రారంభమైన ఈ ప్రవచనాలు ఈ నెల9వ తేదీతో ముగియనున్నాయి. ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళావేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేసారు. తరువాత ప్రవాచకులు తమ ప్రవచాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసమని అన్నారు. శ్రీశైలక్షేత్రానికి అనాదిక్షేత్రమనే ప్రసిద్ధి ఉందన్నారు. ఈ క్షేత్రం చరిత్రకు అందని కాలం నుండి ఉన్నదని అన్నారు.
మనం ఆయా వైదిక కార్యక్రమాలను నిర్వహించుకునేటప్పుడు చెప్పే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పుకుంటామన్నారు. మేరుపర్వతం తరువాత మనం చెప్పుకునే మహాపర్వతం శ్రీశైలమే అన్నారు.
ఇప్పటికీ మనం సాధారణ దృష్టితో చూడలేని దివ్యక్షేత్రాలకు, దివ్యదేవతాస్వరూపాలకు, దివ్యులైన సిద్ధపురుషులకు శ్రీశైలక్షేత్రం నిలయమన్నారు.శ్రీశైలక్షేత్రం సిద్ధక్షేత్రంగా కూడా ప్రసిద్ధమైందన్నారు.
స్కాందపురాణంలోని సనత్కుమార సంహితలో 50 ఖండాలలో అనేక క్షేత్రాల గురించి చెప్పారన్నారు. ఈ ఖండాలలో ప్రధానంగా కాశీఖండం, శ్రీశైలఖండం ఉన్నాయన్నారు. వీటిలో 12వ ఖండం శ్రీశైలం అన్నారు.
ఈ క్షేత్రాధిదేవుడైన మల్లికార్జనస్వామివారి నామమే భవ్యమైన మంత్రస్వరూపమన్నారు. శ్రీశైలంలో ఉన్న ప్రతి శివలింగం అమృతమయమన్నారు. అమృతం అంటే సచ్చిదానందతత్త్వం అని గ్రహించాలన్నారు. శ్రీశైలమహిమను సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడనే నానుడి ఎంతో ప్రసిద్ధమన్నారు.
మహాభారతం శ్రీశైలక్షేత్రాన్ని దివ్యస్థలంగానే కాకుండా శ్రీశైలక్షేత్రంలో అణువణువునా దివ్యత్వం వ్యాపించి ఉందన్నారు.
పవిత్రతీర్థంగా పేర్కొనదన్నారు.కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్
హెచ్.జి. వెంకటేష్, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment