అక్టోబర్ ఒకటి నుంచి బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనాలు
శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం అక్టోబర్ ఒకటి నుంచి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిచే ‘శ్రీశైల మహిమా విశేషాలు’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 9 రోజులపాటు జరిగే ఈ ప్రవచనాలు ఈ నెల 9వ తేదీతో ముగియనున్నాయి.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ప్రతీరోజు సాయంకాలం గం. 7.00 నుండి గం. 8.30ల వరకు ఈ ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమములో ప్రవచకులు శ్రీస్వామిఅమ్మవార్ల ఆవిర్భావం, శ్రీశైల మహాక్షేత్ర ప్రత్యేకతలు, మహిమావిశేషాలు మొదలైన అంశాలను వివరించనున్నారు.
భక్తులందరు కార్యక్రమానికి విచ్చేసి ప్రవచనాలను విని తరించవలసినదిగా దేవస్థానం కోరింది.
Post Comment