
శ్రీశైల దేవస్థానం:వినాయకచవితి సందర్బంగా 18.09.2023 నుండి 27.09.2023 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు
నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల సమయంలో ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామి వారికి, శ్రీశైలం సమీపంలోని
సాక్షిగణపతిస్వామివారికి , యాగశాలలో వేంచేబు చేయించనున్న గణపతిస్వామివారి పంచలోహమూర్తికి
ప్రతీనిత్యం వ్రతకల్పవిశేషార్చనలు నిర్వహిస్తారు.
అదేవిధంగా శ్రీ సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని (మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని) కూడా
నెలకొల్పి ఉత్సవ సమయంలో ప్రతీరోజు వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
కాగా 18 తేదీ వినాయక చవితిరోజున ఉదయం గం.7.00ల నుండి ఈ గణపతి నవరాత్రోత్సవాలు
ప్రారంభిస్తారు.
ఉదయం 7.00గంటలకు యాగశాల ప్రవేశం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, శ్రీవరసిద్ధి
వినాయకవ్రత పూజ.
*18 ఉదయం 9.00 గంటలనుంచి అఖండస్థాపన , మండపారాధన, గణపతి కలశస్థాపన, జపానుష్థానములు
వినాయక చవితి. సాయంత్రం సాయంకాలఅర్బ్చనలు,కలశార్చనలు,సాయంకాలార్చనలు,
5.00గంటలనుండి జపానుష్థానములు,పారాయణములు,అంకురార్పణ,అగ్నిప్రతిస్థాపన,
ఉపాంగ హవనములు, గణపతిహోమం
ఉదయం 8.00గంటలకు .. ‘ ప్రాత:కాలార్చనలు,మండపారాధనలు,కలశార్చనలు, జపానుష్టానములు,
27న ఉదయం 9.00 గంటలకు ‘ పూర్ణాహుతి, కలళశోద్వాసన, అవబ్బృధం, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద
వితరణ.