శ్రీశైల దేవస్థానం: లలితాంబిక వాణిజ్య సముదాయం, ఎల్ బ్లాకులోని దుకాణాలు గురువారం అగ్ని ప్రమాదానికి గురైన కారణంగా ఈ దుకాణదారులకు దేవస్థాన ధర్మకర్తల మండలి తరుపున గౌరవ అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆర్థిక సహాయంగా రూ. 1,40,000/- అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈ ఓ ఎస్. లవన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరుపై నివేదన సమర్పించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నుండి తగు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రమాదంలో కాలిపోయిన దుకాణాలన్నింటిని వారంలోగా పునర్నిర్మాణం చేయిస్తామన్నారు. అగ్ని ప్రమాద నివారణకు అందరు కూడా ఫైర్ సేఫ్టి పరికరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దేవస్థానం తరుపున రాత్రివేళలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కూడిన మోబైల్ టీమ్ను వాణిజ్య సముదాయానికి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు వెంటనే సి.ఎస్.ఓ బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ పర్యవేక్షకులను ఆదేశించారు.
*Uuyala seva performed in the temple.Archaka swaamulu performed the puuja.EO participated in the event.
*శ్రీ సంఘమేశ్వర భజన మండలి, వికారాబాద్ వారిచే భజన కార్యక్రమం*
ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం శ్రీ సంఘమేశ్వర భజన మండలి, వికారాబాద్ వారు భజన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో కైలాసవాసా గౌరివిలాసా, గిరిజజీవన శంకరా, శంభో.. శివశంభో, స్వామిరారా శివలింగ, శివహర పార్వతీ రమణ, అందాల అమ్మ భ్రమరాంబావమ్మా, కోరికలు తీర్చే కొండంత దైవము శంకరుడు మొదలైన పలు భక్తిగీతాలు, అష్టకాలు మొదలైన వాటిని ఎం. మాణిక్ రెడ్డి వి. కోదండము, టి. మల్లేశం, బి. కిష్టయ్య, కె. శ్రీశైలం, ఎ. రవి, జి. మల్లయ్య బి. కవిత తదితరులు ఆలాపించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.