శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం పసుపర్తి వెంకటరమణ, కూచిపూడి నృత్య అకాడమీ, అభినయ స్కూల్ సింహాచలం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
కార్యక్రమం లో వినాయక కౌత్వం, నటరాజ తిలానా, మల్లికార్జున కౌత్వం, శివాష్టకం, భ్రమరాంబిక అష్టకం తదితర గీతాలకు ధన్య, గాయత్రి, ఎ. యక్షిత, భవాని, పూజిత, కావ్య, ప్రసన్న, హర్షిణి, మాలతి, భాను, లాస్య, లలిత తదితరులు నృత్య ప్రదర్శన చేసారు. మృదంగ సహకారాన్ని అనంతరావు, వయోలిన్ సహకారాన్ని శ్రీరామ్ అందించారు.