ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అవార్డులను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 213 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 6 వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు మోతి గల్లీలోని చౌమహల్లా ప్యాలస్ ఎదురుగా గల ఉర్దూ మస్కాన్ హాల్ లో ఈ అవార్డులను అందించనున్నట్లు ఉర్దూ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ ఖాజా ముజీవుద్దీన్, డైరెక్టర్ షఫీఉల్లా లు హాజరుకానున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.