శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం శ్రీ వెంకటేశ్వర కూచిపూడి నృత్యకళాక్షేత్రం, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసారు.
కార్యక్రమం లో వినాయకౌత్వం, శివశివ శంకర, ఓం నమ:శివాయ, శివతాండవం, తదితర గీతాలకు ఎం. మల్లిక, టి అక్షయ, శ్రీలేఖ, జె. సాయికీర్తన, ఆర్. భవాని, ఎ. వర్షశ్రీ, ఎ. భవ్య, హెచ్. తన్మయ, కె. తేజశ్రీ, బి. వైష్ణవి, కె. శ్రీకార్తిక, బి. సహస్ర, జె హరిణ్య, ఎ. అక్షర, బి. ప్రీతిక, తదితరులు నృత్య ప్రదర్శన చేసారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
*Sakshi Ganapathi Abhishekam, Jwala Veerabhadra Swamy Puuja performed in the temple by Archaka swaamulu.