
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 11 నుండి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని దేవస్థానం వారు కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, గవర్నరును కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో గవర్నరుకు వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామి అమ్మ వార్ల జ్ఞాపిక, దేవస్థానం క్యాలెండర్లను అందించారు.
ముఖ్యమంత్రికి ఆహ్వానం:
ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధ్యాపక, అర్చకస్వాములు ముఖ్యమంత్రి ని కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమములో ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపిక, దేవస్థానం క్యాలెండర్లు , డైరీని అందించారు.
ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రికి ఆహ్వానం:
ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ను కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధ్యాపక, అర్చకస్వాములు కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.ఈ కార్యక్రమములో దేవదాయశాఖ మంత్రికి వారికి వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించారు.
ఆ తరువాత కమిషనరు కార్యాలయం లో దేవదాయశాఖ కమిషనర్ డా. ఎం. జవహర్లాల్ ను కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.