
శ్రీశైల దేవస్థానం: యస్. రాహుల్, శ్రీమతి జయలక్ష్మి, సికింద్రాబాద్ వారు బంగారు కమండలాన్ని శ్రీశైల దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. ఈ బంగారు కమండలపు బరువు 570 గ్రాములు.ఆలయప్రాంగణంలోని వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయ మండపంలో ఈ బంగారు కమండలానికి ఈ ఓ ఎస్. లవన్న, అర్చకస్వాములు, దాతలు, సంప్రోక్షణను నిర్వహించారు. అనంతరం బంగారు కమండలాన్ని కార్యనిర్వహణాధికారికి అందజేశారు.ఈ సమర్పణ అనంతరం దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందించారు.