
శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 11 నుండి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకుగాను వివిధ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు పాదయాత్రతో వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైలక్షేత్రాన్ని చేరుతారు.ఈ కారణంగా కాలిబాట మార్గములో అటవీ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సహకారం తో భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు నాగలూటి, దామర్లకుంట, పెద్దచెరువు ప్రాంతాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( బసి) చంద్రశేఖరశాస్త్రి, ఉద్యానవన అధికారి లోకేష్, సహాయ స్టపతి బి.యు.వి జవహర్లాల్, సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.
నాగలూటి వద్ద జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు పైప్ పెండాల్స్ ఏర్పాటు చేస్తారు. మంచినీటిని కూడా సరఫరా చేస్తారు. జనరేటర్ ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ పనులు కూడా చేస్తారు. అక్కడి పుష్కరిణిని కూడా శుభ్రపరుస్తారు.అదేవిధంగా పెద్ద చెరువు, దామర్లకుంట వద్ద కూడా పైప్ పెండాల్స్ తో పాటు జనరేటర్లను ఏర్పాటు చేసి తాత్కాలిక విదుద్దీకరణ చేస్తారు.