
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం ఇందిరా మయూరి డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఆనంద నర్తన గణపతీం, లింగాష్టకం, నాగేంద్రహారాయా, అయిగిరినందిని తదితర గీతాలకు యుక్తారెడ్డి, యామిని, మౌక్తిక, మాధురి, నక్షత్ర, అన్విక తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
రెండో కార్యక్రమం లో భాగంగా శ్రీ సాయిదేవ్ కూచిపూడి అకాడమీ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో గణేశ పంచతంత్రం, మహాదేవ నమ: శివాష్టకం, రాజరాజేశ్వరి అష్టకం తదితర గీతాలకు బి. లావణ్య, జూపూడి వర్ణిక, ద్వారం యల్లంరాజు, వైష్ణవి, జైశ్రీ తులసీ భవిత్య, పూజిత, త్రివేణి, మనస్విణి, తన్వి, శ్రద్ధ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.